Site icon Prime9

Writer Sriramana : తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ రచయిత “శ్రీ రమణ” మృతి

tollywood writer sriramana passed away due to health isssues

tollywood writer sriramana passed away due to health isssues

Writer Sriramana : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ రచయిత శ్రీ రమణ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వేకువజామున 5 గంటలకు స్వగృహంలో కన్నుమూసినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో చిత్రసీమలో విషాదం నెలకొంది. శ్రీరమణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో శ్రీరమణ జన్మించారు. అక్కడే ఫస్ట్‌ ఫారమ్‌లో చేరిన శ్రీరమణ.. తర్వాత బాపట్ల ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అనంతరం నవ్య వార పత్రికకు ఎడిటర్‌ గానూ పనిచేశారు. పేరడి రచనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. బాపు, రమణలతో కూడా కలిసి పనిచేశారు. శ్రీకాలమ్‌, శ్రీఛానెల్‌, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి ఎన్నో శీర్షికలు ఆయన నుంచే వచ్చాయి.

అలానే శ్రీరమణ టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో 2012 లో వచ్చిన “మిథునం”   చిత్రానికి సినిమాకు రమణ కథ అందించారు. ఈ సినిమాతో శ్రీ రమణకు మంచి పేరు వచ్చింది. కాగా ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్న క్రమంలో ఈ వార్త మరింత విషాదాన్ని నింపిందని చెప్పాలి.

 

Exit mobile version