Site icon Prime9

Tollywood: టాలీవుడ్‌లో విషాదం – ప్రముఖ గేయ రచయిత కన్నుమూత

Tollywood Lyricist Kulasekhar Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ పాట రచయిత కులశేఖర్‌(54) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తూ సోషల్‌ మీడియాలో వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

కాగా కులశేఖర్‌ 100పైగా సినిమాలకు పాటలు రాశారు. అందులో చిత్రం, జయం, సంతోషం, సైనికుడు, మనసంతా నువ్వే, నువ్వు-నేను, ఔనన్నా కాదాన్నా, ఘర్షణ, భద్ర వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పాటలు రాసి మంచి గుర్తింపు పొందారు. కాగా ఆయన రాసిన పాటలన్ని దాదాపుగా మంచి విజయం సాధించాయి. టాలీవుడ్‌ స్టార్‌ రైటర్‌గా గుర్తింపు పొందిన ఆయనకు ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి.

దీంతో మద్యానికి బానిసైన ఆయన కొన్నేళ్ల క్రితమే చిత్ర పరిశ్రకు దూరమయ్యారు. కొన్ని ఏళ్ల కిందట ఓ దొంగతనం కేసులో అరెస్టై 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఇటూ అవకాశాలు లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన మెరుగైన చికిత్సకు డబ్బులు లేక పరిస్థితి విషమించడంతో దయనీయ పరిస్థితిలో కన్నుమూశారు.

Exit mobile version