Site icon Prime9

Tollywood: రెండు చిత్రాలకు మంచి టాక్.. జోష్ లో టాలీవుడ్

Tollywood: జూలై నెల తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద అసలు వర్కవుట్ కాలేదు. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్‌డే, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే శుక్రవారం విడుదలయిన రెండు చిత్రాలకు మంచి మౌత్ టాక్ రావడంతో ప్రేక్షకులు ధియేటర్లకు రావడం మొదలు పెట్టారు.

హీరో కళ్యాణ్‌రామ్ నటించిన బింబిసార చిత్రానికి చేసిన ప్రమోషన్లు ఫలితాన్నిచ్చాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా బి & సి సెంటర్లలో, ఈ సినిమా టిక్కెట్ కోసం ప్రేక్షకులు థియేటర్ల వెలుపల భారీగా గుమికూడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం మొదటి వారంలో మంచి వసూళ్లు సాధించే అవకాశం వుంది.

అదేవిధంగా ఎ సెంటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో, దుల్కర్ సల్మాన్ మరియు దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో వచ్చిన సీతారామం మంచి సందడి చేస్తోంది. ఈ క్లాస్ లవ్ స్టోరీని చూడటానికి ఇప్పటికే యువత థియేటర్‌లకు పరుగెత్తుతున్నారు. చాలాకాలం తరువాత ధియేటర్ల వద్ద “హౌస్‌ఫుల్” బోర్డులు కనపడటం పరిశ్రమకు ఖచ్చితంగా సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. టాలీవుడ్ మరియు సినీ ప్రేమికులకు శ్రావణ శుక్రవారం మంచి రోజుగా మిగిలిపోయింది.

Exit mobile version