Prime9

Kondagattu: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన రద్దు.. కారణం ఇదే

Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నేడు కొండగట్టుకు రావాల్సిన సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.

పర్యటన రద్దుకు కారణం ఇదే..(Kondagattu)

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కొండగట్టు పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం ఆయన ఇక్కడికి రావాల్సి ఉంది. కాగా చివరి క్షణంలో ఈ పర్యటన రద్దు చేసుకున్నారు. బుధవారం ఆయన ఇక్కడికి రానున్నారు. ఇక మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో కొండగట్టుకు వస్తారని తెలిసి.. కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనే అంశంపై కేసీఆర్ ప్రత్యక్షంగా సూచనలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించనున్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారమే కేసీఆర్ ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వస్తారు. దీంతో తన పర్యటన వల్ల.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఒకరోజు వాయిదా వేసినట్లు సమాచారం. యాదాద్రి ఆలయ అభివృద్ధి తరహాలోనే కొండగట్టును కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆర్కిటెక్ట్‌గా ఆనంద్‌సాయి

యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణానికి ఆనంద్ సాయి ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారు. కొండగట్టు దేవాలయానికి సైతం ఆనంద్‌సాయి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఓ సారి ఆలయంను ఆయన పరిశీలించారు. బుధవారం సీఎం కేసీఆర్ వెంట.. ఆనంద్ సాయి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. దేవాలయంలో భక్తులకు వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో.. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ భాస్కర్‌ కొండగట్టును సందర్శించారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.

Exit mobile version
Skip to toolbar