Site icon Prime9

Tirumala Hundi Collection: గతేడాది రూ.1,450 కోట్లు సంపాదించిన తిరుమల వెంకన్న

Tirumala

Tirumala

Tirumala Hundi Collection: వడ్డీ కాసుల వాడి హుండీ(Tirumala hundi) ఆదారం రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది తిరుమల వెంకన్న ఆదాయం రూ. 1,450 కోట్లు. కరోనా తర్వాత గత ఏడాదిలో శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శంచుకున్నారు.

తిరుమలలో 2022 ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలను ఉన్నా.. ఆ తర్వాత వాటిని రద్ధు చేసింది టీటీడీ. దీంతో 2022 మే నుంచి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది.

గత ఏడాదిలో 2.37 కోట్ల మంది భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.1450 కోట్లు లభించింది.

అంతేకాకుండా 11.54 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయి. 1.09 కోట్ల మంది తలనీలాలు సమర్పించగా, 4.77 కోట్ల మందికి అన్నప్రసాదాలు అందజేసింది టీటీడీ.

6 లక్షల మందికి ఉత్తర దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా 6.06 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 2 న ప్రారంభమైన వైకుంఠ దర్శనాలు 11 వరకు కొనసాగాయి.

దీంతో ఈ పదిరోజుల్లో శ్రీవారికి రూ. 39.40 కోట్ల ఆదాయం లభించింది. కాగా, ధనుర్మాసం సందర్బంగా సుప్రభాత సేవను రద్దు చేసిన టీటీడీ.. తిరిగి 15 నుంచి పునరుద్ధరించింది.

పది రోజులకు శ్రీవారి హుండీకి రూ.39.40 కోట్లు రాగా, లడ్డూ విక్రయాల ద్వారా రూ.34.60 లక్షలు ఆదాయం లభించినట్టు వివరించారు. ఈ నెల 28న రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.

గత రికార్డుల బ్రేక్ చేస్తూ

శ్రీవారి హుండీ (Tirumala hundi) కానుకలు 1950 వరకు రోజులు లక్ష రూపాయలు ఉండేవి. 1958 లో తొలిసారి ఆదాయం లక్ష దాటింది. 1990 ల నాటికి అది కోటికి పెరగగా.. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.

తిరుమల శ్రీవారికి 2020 వార్షిక ఆదాయం రూ. 731 కోట్లు కాగా, 2021 లో అది రూ. 933 కోట్లకు చేరింది. ఇక గత రికార్డుల బ్రేక్ చేస్తూ 2020 వార్షిక ఆదాయం రూ. 1,450 కోట్లు లభించింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version