Site icon Prime9

Neck Pain: ఇలా చేస్తే మెడనొప్పుల నుండి పూర్తి ఉపశమనం పొందవచ్చు .. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి

tips for reducing the neck-pain

tips for reducing the neck-pain

Neck Pain : వయసు పైబడే కొద్ది నొప్పులు రావడం సహజం . కానీ కొన్ని కొన్ని సార్లు వయసుతో సంబందం లేకుండా కూడా నొప్పులు వస్తాయి. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టె నొప్పి మెడ నొప్పి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల మెడనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మెడ నొప్పితో భాదపడే పరిస్తితి వచ్చింది . దీనికి ప్రధాన కారణం.. సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోవడమే. సరైన పొజిషిన్‌లో కూర్చోకపోతే మెడ కండరాలు బిగుసుకుపోయి మెడ నొప్పి వేధిస్తుంది.

మారిన కాలంతో పాటు జీవనశైలి కూడా మారింది. ముఖ్యంగా పనితీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన పని ఉండేది. అప్పుడు శరీరం కదులుతూ ,శ్రమ పడుతూ పనులు చేసుకునే వారు కాబట్టే శారీరక నొప్పులు అనేవి ఉండేవి కావు. కానీ ఇప్పుడు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఏకంగా 12 గంటలపాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పని చేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్‌ల వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో తల కిందికి దించుకొనే ఎక్కువ సమయం కూర్చొనే గడుపుతున్నారు. దీని వల్ల విపరీతమైన మెడ నొప్పి వస్తుంది. దీనికి పూర్తి పరిష్కారం లేదు కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

మెడనొప్పితో బాధపడే వారు కండరాలు రిలీఫ్‌ అయ్యే వ్యాయామాలను చేయాలి. నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేయడం ప్రతి రోజూ అలవాటుగా మార్చుకోవాలి. మెడను నాలుగు దిక్కుల తిప్పుతూ కండరాలు ఫ్రీ అయ్యేల వ్యాయాయం చేయాలి. ఇక అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పని చేయకూడదు. ఒక వేల పని చేసిన దానికి తగ్గట్టు రెస్ట్ ఉండేలా చూసుకోవాలి . కాసేపు పనిలో బ్రేక్‌ తీసుకుంటూ తలను అప్పుడప్పుడు పైకి ఎత్తుతూ ఉండాలి. విరామ సమయంలో మెడను నెమ్మదిగా తిప్పాలి.

ఇక కంప్యూటర్ ముందు పనిచేసే సమయంలో స్క్రీన్‌ను కాస్త పైకి ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా తల కిందికి ఉండేలా స్క్రీన్‌ ఉండకూడదు. ఇలా స్క్రీన్‌ కిందికి ఉంటే.. మెడపై ఒత్తిడి పెరుగుతుంది కండరాలు దృఢత్వం కోల్పోతాయి. నడిచే సమయంలో కూడా సరైన పొజిషన్‌లో ఉండాలి. భుజాలు, మెడ వంచి నడవకూడదు. భుజాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

Exit mobile version