Site icon Prime9

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ నుండి రానున్నసెకండ్ సాంగ్ .. ఎప్పుడో చూసెయ్యండి ..

tillu-square movie second song details

tillu-square movie second song details

Tillu Square : సిద్దు జొన్నలగడ్డ ఒక్క మూవీ తో  ఓవర్ నైట్ లో స్టార్ అవ్వొచ్చు అని నిరూపించాడు . డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి  ఆ ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆ చిత్రానికే సీక్వెల్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సీక్వెల్ లో టిల్లుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇక ఆల్రెడీ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన టిల్లు.. ఇప్పటికే ఒక సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘టికెటే కొనకుండా’ అంటూ మొదటి సాంగ్ ని చూపించారు టిల్లు. అనుకున్నట్టుగానే సాంగ్ మంచి ఆదరణ పొందింది , ఇప్పుడు సెకండ్ సింగిల్ ని తీసుకు వస్తున్నాడు.

రాధిక రింగులు జుట్టుకి పడిపోయానంటూ.. టిల్లు ప్రేమగోల చేస్తున్నాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి రామ్ మిరియాల సంగీతం అందిస్తూ పాటని పాడారు. సాంగ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. సాంగ్ ఫుల్ జోష్ మూడ్ లోకి తీసుకొనిపోయేలా ఉంది . అయితే ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 27న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్దునే కథని అందిస్తున్నారు. టిల్లు 1కి సిద్ధునే కథని, మాటల్ని అందరించారు.ఇప్పుడు కూడా వారే ఈ కథకి మాటల్ని అందిస్తున్నారు .

ఇక ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్టుపోన్ అయ్యింది. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉండడం, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అనుపమ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం.. మూవీకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. మరి ఈ సినిమాతో టిల్లు గాడు ఏ రేంజ్ గోల చేస్తాడో చూడాలి.
మళ్ళీ ఎలాంటి చిక్కుల్లో పడతాడో మూవీ చూసి తెలుసుకోవాలి .

Exit mobile version