అనకాపల్లి జిల్లా బవులువాడ గ్రామ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఆవు దూడపై దాడి చేసిన పుని సమీప అడవిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పుని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. పులి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నో పయనిస్తోందని.. తెల్లవారు జామున సూర్యకిరణాలు చూసి వాటిని అనుసరించి ప్రయాణిస్తుందని అటవీశాఖ విశాఖ రేంజ్ అధికారి రామ్ సురేష్ తెలిపారు. పులిని బోన్ లో బంధించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.