Prime9

MP Rahul Gandhi : మీలాగే నేను కూడా పెళ్లి చేసుకోను.. రాహుల్‌‌తో యువతి సంభాషణ వైరల్‌

Rahul Gandhi participated in the Samvad program : లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీతో ఓ యువతి జరిపిన ఇంటరాక్షన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

రియా పాశ్వాన్‌ ఓ సామాజిక కార్యకర్త. సోషల్ మీడియా వేదికగా నెలసరి సమయంలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తుంటారు. బిహార్‌లో జరిగిన మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాహుల్‌ గాంధీతో వివాహం అంశంపై ఆసక్తికర చర్చ జరిపారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన శక్తి అభియాన్‌ వల్ల తన జీవితంలో మార్పు వచ్చిందని ఆమె అన్నారు. విద్యతోపాటు వివిధ రంగాల్లో మంచి మార్పు రావాలంటే రాజకీయాలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. కానీ, ఈ రంగంలోకి రావడానికి చాలా మంది మహిళలు ఆసక్తి చూపడం లేదన్నారు.

 

శక్తి అభియాన్‌ సమయంలో తాము ఎంతో కృషి చేశామన్నారు. ఇప్పుడు చాలా పెద్ద టీమ్‌ తయారైందని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య పరిష్కారానికైన ప్రజలు తమ వద్దకు రావడం గర్వంగా ఉంన్నారు. శక్తి అభియాన్‌ వల్ల తమలో చాలా మార్పు వచ్చిందని రియా తెలిపారు. అందుకు రాహుల్ స్పందించారు. ఇది మంచి విషయమన్నారు. మీ ప్రసంగం బాగుందని పొగిడారు. అనంతర ఆమె మాట్లాడారు. మీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. మీలాగే తాను కూడా వివాహం చేసుకోనని చెప్పారు. ప్రజల కోసం తన వంతు కృషి చేస్తానని అన్న ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Exit mobile version
Skip to toolbar