Solar Electricity: నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రం.. ధర యూనిట్‌కు రూ.3.16 పెంపు

పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.

Solar Electricity: పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.

ప్రభుత్వ పరిధిలోని జెన్‌కోకు చెందిన మినీ హైడల్‌ స్టేషన్‌ నుంచి 4.6మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్‌ నిర్ణయించింది. ఈ కొనుగోలుకు అంగీకారం తెలపాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంది.

సోలార్ పవర్(Solar Electricity) ఛార్జులు ఎంత పెరిగాయంటే..

ఈ కోనుగోలుపై వచ్చే నెల ఫిబ్రవరి 14వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలిపింది.

ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోపు ఏమైనా సూచనలు.. సలహాలు ఉంటే పంపించాలని ఈఆర్సీ కోరింది.

ఈ ఒప్పందంపై ఈనెల 30వతేదీ సాయంత్రం 5గంటల్లోగా సూచనలు/సలహాలు పంపించాలని ఈఆర్‌సీ కోరింది.

ప్రజాభిప్రాయ సేకరణలో ఆమోదం లభిస్తే ఇక 25ఏళ్ల పాటు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ ను కొనుగోలు చేయనుంది.

పెద్దపల్లి జిల్లాకు ప్రధానంగా ఎస్సారెస్పీ కాలువ నీళ్లే ఆధారం. విద్యుత్‌ తయారీకి నిరంతరంగా నీటి ప్రవాహం ఉండాలి. ప్రభుత్వం జెన్ కో ఆధ్వర్యంలో1986-87లో 9.16మెగావాట్ల సామర్థ్యంతో 10 మినీ హైడల్‌ జల విద్యుత్‌ కేంద్రాలు(Solar Electricity) ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌కు విక్రయిస్తున్నారు.

ఈ కొనుగోలుతో సౌర విద్యుత్ కు మరింత డిమాండ్ పెరగనుంది. రాబోయే కాలంలో సౌర విద్యుత్ అత్యంత క్రియాశీల పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ కొనుగోలు దానికి మరింత బలం చేకూర్చనుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/