Hyderabad Roads: హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎప్పుడు ఏ రోడ్డు ఎలా కుంగిపోతుందో అని వాహనదారులు నిరంతరం భయపడుతున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఉన్న పళంగా రోడ్డు కుంగిపోయింది. పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఓ ట్రక్కు అందులో పడిపోయింది.
నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. హిమాయత్ నగర్‌లో జరిగిన ఘటన.. వాహనదారుల్లో మరింత భయాన్ని పెంచుతుంది. హైదరాబాద్ లో ఇది రెండో ఘటన.
ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నగరంలో గతుకుల రోడ్లతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరింత దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాల తర్వాత.. రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు రిపేర్లు చేసినా.. మళ్లీ పాత కథే రిపీట్ అవుతుంది.
దీంతో రోడ్డు మీద గుంత ఎక్కడ పడుతుందో అని తెలియక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్ల నిర్మాణం, రిపేర్ల సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
క్వాలిటీ కంట్రోల్ విభాగం ఉన్నప్పటికి ఈ విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు.
ప్రతి ఏటా రోడ్ల మెయిటెనెన్స్ కోసం బల్దియా వందల కోట్లు ఖర్చు చేస్తుంది.
రోడ్ల నిర్మాణాలలో నాణ్యతను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.
అధికారులు ఇకనైనా స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్లు నాణ్యతపై జీహెచ్ఎంసీ GHMC ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/