Site icon Prime9

Ayyannapatrudu : టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. కారణం ఏంటంటే ?

telugudesam party senior leader Ayyannapatrudu arrested

telugudesam party senior leader Ayyannapatrudu arrested

Ayyannapatrudu : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆయనను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ ఉదయం ఎయిర్ ఏషియా విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 10.05 గంటలకు విశాఖకు చేరుకున్నారు.

కాగా సుమారు 15 నిమిషాల తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టి, బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయ్యన్నను బలవంతంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆగస్టు  22న  గన్నవరంలో యువగళం సభ నిర్వహించారు. ఈ సభలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులపై  అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై  మాజీ మంత్రి పేర్నినాని  కృష్ణా జిల్లాలోని ఆతుకూరు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ సభలో పాల్గొన్న అయ్యన్న సహా ఇతర నేతలు చేసిన ప్రసంగాలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం.

 

 

Exit mobile version