Site icon Prime9

CCL 2023 : సీసీఎల్ 2023 ఛాంపియన్ గా “తెలుగు వారియర్స్”.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన అఖిల్

telugu waarriors beat bhojpuri in ccl finals and won title

telugu waarriors beat bhojpuri in ccl finals and won title

CCL 2023 : ఈ ఏడాది ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ అభిమానులు అందర్నీ నెక్స్ట్ లెవెల్లో అలరించింది అని చెప్పాలి. కాగా 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో అత్యధికంగా నాలుగు సార్లు సీసీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్ చరిత్ర సృష్టించింది.

విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భోజ్ పురి దబాంగ్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ను పది ఓవర్ లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ లో నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.

పవర్ ఫుల్ ఇన్నింగ్స్ తో చెలరేగిన అఖిల్ (CCL 2023)..

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది తెలుగు వారియర్స్. ఓపెనర్, తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని 36 బంతుల్లో 67 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తరువాత సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన భోజ్ పురి దబాంగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్ లో ఒక్క వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు. పలువురు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ ని వీక్షించారు. జట్టు మెంటర్ వెంకటేష్ ఫైనల్ మ్యాచ్ లో అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్రమంత్రి అమర్నాథ్ బాక్స్ లో కూర్చొని మ్యచ్ ను వీక్షించాడు.

 

 

టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన అఖిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అఖిల్‌ ఎంపికయ్యాడు. కాగా సీనియర్‌ హీరోలు విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి వరకు తెలుగు వారియర్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఈ ఏడాది తమన్‌ మాత్రం ఈ సీసీఎల్ లో తనదైన శైలిలో రాణించి ప్రేక్షకుల గుండెల్లో మరింత స్థానం సంపాదించుకున్నారు.

 

Exit mobile version