Republic Day : తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. భవనాలు నిర్మించడమే అభివృద్ది కాదన్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.

  • Written By:
  • Updated On - January 26, 2023 / 09:38 AM IST

Republic Day : తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై తెలంగాణ రాష్ట్రం ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూనే పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..

ముందుగా తెలుగులో తన స్పీచ్ ప్రారంభించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు.

రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు.

ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని అన్నారు.

తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని.. వైద్యం, ఐటీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని.. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉందని గవర్నర్ తెలిపారు.

ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్‌ రైలును కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు.

గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని.. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు వెల్లడించారు.

 

 

భవనాలు నిర్మించడమే అభివృద్ది కాదంటూ (Republic Day)..

అయితే గవర్నర్ తమిళిసై పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

కొంతమందికి నేను నచ్చకపోవచ్చు..కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోందని .. రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు.

కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.

అలానే రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.

కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు.

ఎంత కష్టం అయిన పని చేస్తానని.. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు.

దేశభక్తితో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని తెలిపారు.

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలని, సవాళ్లకు అనుగుణంగా కొత్త విధానాలు అనుసరిస్తున్న రైతుల స్ఫూర్తికి సెల్యూట్ అన్నారు గవర్నర్‌.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/