Site icon Prime9

Shahrukh Khan : షారుఖ్ ఖాన్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన స్విగ్గీ.. మీకోసమే తీసుకువచ్చాం అంటూ !

swiggy surprise to bollywood star hero sharukh khan

swiggy surprise to bollywood star hero sharukh khan

Shahrukh Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే షారుఖ్‌ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన సినిమా పఠాన్.  సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వివాదాల నడుమ విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య విడుదలైనప్పటికి.. రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టించింది. వరుస ప్లాపులతో కుంగిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రికి.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి భారీ సక్సెస్ అందుకుంది.

అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టిక్ గా ఉండే షారుఖ్ ఖాన్ (Shahrukh Khan).. పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా #AskSRK అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. దీనికి అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ చిట్ చాట్ సెషన్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు షారుఖ్. ఈ ఘటనలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

ఈ ఇంటరాక్షన్ లో ఒక అభిమాని.. ‘భోజనం చేశావా భాయ్?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి షారుఖ్ (Shahrukh Khan) బదులిస్తూ.. ఎందుకు భాయ్.. “నువ్వేమైనా స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతావా?” అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇక ట్వీట్ చూసిన స్విగ్గీ సంస్థ షారుఖ్ ఇంటికి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసింది. ముంబై లోని షారుఖ్ ఇంటి వద్ద ఫుడ్ పార్సిల్స్ తో నిలబడ్డ డెలివరీ బాయ్స్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మీ కోసం మేము డిన్నర్ తీసుకు వచ్చాం’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డంకీ, జవాన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. జవాన్ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని షారుఖ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

 

షారూఖ్ ఖాన్ కుమారుడు, కుమార్తె గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. షారూఖ్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ ఖాన్ ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వనుంది సుహానా. అయితే హీరోయిన్ అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది.

Exit mobile version