Site icon Prime9

Jyothika: సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు! – కంగువా నెగిటివ్‌ రివ్యూస్‌పై సూర్య భార్య జ్యోతిక అసహనం

Jyothika About Kanguva Negative Reviews: భారీ అంచనాల మధ్య తమిళ స్టార్‌ హీరో సూర్య ‘కంగువా’ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్న ఈ సినిమా ఫస్ట్‌ షో తర్వాత నెగిటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకుంది. ఫస్టాఫ్‌ బోర్‌ కొట్టించిందని, ఇందులో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ ఉన్నాయ రివ్యూస్‌ వచ్చాయి. అయితే కొన్నిచోట్ల సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ కూడా వచ్చింది. కానీ, కోలీవుడ్‌లోనూ కంగువాకు సినీ ప్రముఖులు, మీడియాలో కంగువాపై నెగిటివ్‌ రివ్యూస్‌ ఇస్తున్నారు. దీంతో వాటిపై తాజాగా సూర్య్‌ భార్య, నిర్మాత జ్యోతిక స్పందించింది. ‘కంగువా’పై కుట్ర జరుగుతోందని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

సూర్య భార్యగా కాదు..

“నేను ఈ నోట్‌ని జ్యోతికగా ఓ సినిమా లవర్‌గా రాస్తున్నా. నటుడు సూర్య భార్యగా కాదు. కంగువా – ఓ అద్భుతమైన సినిమా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సినిమాని ముందుకు నడిపించడానికి చేసిన సాహసం చాలా గొప్పది. ఈ సినిమా మొదటి అరగంట బాగాలేదు. అది నేను ఒప్పుకుంటున్నా. అలాగే మ్యూజిక్‌ కూడా చాలా లౌడ్‌గా ఉంది. ఎన్నో భారతీయ సినిమాల్లో ఇలాంటి లోపాలు ఉండటం సహజమే. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో ఎన్నో ప్రమోగాలు చేస్తారు. కాబట్టి ఇవి పెద్ద మిస్టెక్స్‌ అని నేను అనుకోవడం లేదు.

పాజిటివ్స్ సంగతేంటి?

మొత్తం మూడు గంటల సినిమాలో మొదటి అరగంట బాగాలేకపోతే మొత్తం సినిమా బాగలేదనడం న్యాయం కాదు. నిజం చెప్పాలంటే కంగువ ఓ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ మూవీ. ఇందులో కెమెరా వర్క్‌, ఎగ్జిక్యూషన్‌ ఇంతకు ముందెన్నడు ఏ తమిళ చిత్రంలో చూడలేదు. కానీ కంగువాపై మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్‌ రావడం చూసి నేను షాక్‌ అయ్యాను. ఎందుకంటే వారంత ఇంతకు ముందు చూసిన పాత కథలు, అమ్మాయిల వెంటపడటం, డబుల్‌ మీనింగ్ డైలాగ్స్‌ మాట్లాడటం, హేవీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్న చిత్రాల గురించి వారెప్పుడు నెగిటివ్‌గా మాట్లాడటం వినలేదు. అత్యుత్తమ యాక్షన్‌ సీన్స్‌ ఉన్న కంగువ గురించి ఇలా చెప్పడం ఆశ్చర్యపరిచింది.

తొక్కేయాలని చూస్తున్నారు?

అది సరే మరి కంగువాలో ఉన్న పాజిటివ్స్‌ సంగతేంటి? సెకండాఫ్‌లో ఉమెన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, కంగువాకు బాలుడు చూపించిన ప్రేమ, ద్రోహం? గురించి ప్రస్తావించలేదు. మీ రివ్యూస్ రాసేటప్పుడు పాజిటివ్స్‌ గురించి మర్చిపోయారని అనుకుంటున్నాను. ఫస్ట్‌డే పూర్తి షో కాకముందే ఫస్టాఫ్‌తోనే కంగువాకు వరుసగా నెగిటివ్‌ రివ్యూస్ రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే కావాలని సినిమాను తొక్కేయాలని చూస్తున్నారా? అనిపించింది. ఇది అద్భుతమైన దృశ్యం! మూవీ కాన్సెప్ట్, కస్టానికి కనీస ప్రశంసలు దక్కాలి. నెగిటివ్‌ మాట్లాడేవాళ్లకు అదోక్కటి మాత్రమే తెలుసు. కానీ కంగువా మాత్రం గర్వించదగ్గ చిత్రం” అంటూ జ్యోతిక పోస్ట్‌లో రాసుకొచ్చింది.

అయితే కంగువా మొదట నెగిటివ్‌ రివ్యూస్‌ వస్తున్నా థియేట్రికల్‌ రన్‌ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు రికార్డు వసూళ్లు రాబడుతుంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా కంగువా రూ. 89.32 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఇక మూవీ జోరు చూస్తుంటే మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ చేసేలా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రీన్‌ స్టూడియోస్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కేజీ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు.

Exit mobile version