Site icon Prime9

Supreme Court: రఘురామకృష్ణంరాజు కంపెనీ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court stay

Supreme Court stay

New Delhi: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు భారత్‌ ధర్మల్‌ కంపెనీ పై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన కంపెనీ దివాళా తీసిందంటూ ప్రకటించడాన్ని గతంలో ఎంపీ రఘురామ హైకోర్టులో సవాలు చేశారు. దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదన్నారు.

మొదట హైకోర్టులో ఎంపీ రఘురామకు ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న హిమా కోహ్లీ రఘురామపై దాఖలైన సీబీఐ కేసు విచారణ పై స్టే విధించారు. జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ సీజే అయిన తరువాత స్టే తొలగించడం జరిగింది. హైకోర్టు నిర్ణయాన్ని ఎంపీ రఘురామ సుప్రీంలో సవాలు చేశారు. రఘురామ పిటిషన్‌ను న్యాయమూర్తులు అజరు రస్తొగి, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తుది తీర్పు వెలువడేంతవరకూ కేసు విచారణను నిలిపివేయాలని సీబీఐకి ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపధ్యంలో సీబీఐ కేసు విచారణ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Exit mobile version