Site icon Prime9

1993 Mumbai blasts: అబు సలేంను విడుదల చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశాలు

New Delhi: గ్యాంగ్‌స్టర్‌ అబు సలేంను ముంబై బాంబు పేలుళ్ల కేసులో విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి అబ సలేం 25 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేశారు. మంబై బాంబు పేలుళ్లకు సంబంధించి నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం పోర్చుగల్‌ ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చిందని అబు సలేం గుర్తు చేశారు. 25 సంవత్సరాల శిక్ష తర్వాత పూర్తయిన నేపథ్యంలో తనను పోర్చుగల్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు అబు సలేం.

రాష్ర్టపతి విశేషాధికారాలను వినియోగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ‌72 ప్రకారం శిక్ష పూర్తయిన వెంటనే సలేంను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెంచ్‌ జడ్జిలు ఎస్‌ కె కౌల్, ఎంఎం సుందరేశ్‌ కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఇదిలా ఉండగా అబు సలేంను ముంబైలో ఓ బిల్డర్‌ ప్రదీప్‌జైన్‌ను తన డ్రైవర్‌ మెహదీ హసన్‌తో కలిసి హత్య చేసిన కేసులో ఫిబ్రవరి 25, 2015లో యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి సుదీర్ఘకాలం న్యాయపోరాటం తర్వాత పోర్చుగల్‌ నుంచి నవంబర్‌ 11, 2005లో అబు సలేంను భారత్‌కు రప్పించారు. కాగా అబు సలేం న్యాయయాది సుప్రీంకోర్టును ఆశ్రయించి శిక్ష పూర్తయిన వెంటనే సలేంను పోర్చుగల్‌కు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. నేరస్తుల అప్పగింత నిబంధలను గౌరవించాలని కోరారు.

Exit mobile version