Site icon Prime9

Rajini Kanth : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాదాలకు నమస్కరించిన సూపర్ స్టార్ రజనీకాంత్

super star rajini kanth takes blessings from up cm yogi

super star rajini kanth takes blessings from up cm yogi

Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా విడుదల సమయంలోనే రజినీకాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే హిమాలయాల్లో పర్యటన పూర్తి అయిన అన్నతరం పలు పుణ్య క్షేత్రాలను దర్శించే పనిలో పడ్డారు రజినీ.

ఈ మేరకు తాజాగా రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు. దాంతో ఆయనకు నమస్కరించిన సూపర్ స్టార్ ఆ వెంటనే ఆయన పాదాలకూ నమస్కరించారు. అనంతరం సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులతో కలిసి తన జైలర్ సినిమాను చూసేందుకు ఆయన లక్నోకు వచ్చారు. సినిమా హిట్ కావడం అంతా దేవుడి దయ అన్నారు.

అంతకు ముందు రజినీ ఝార్ఖండ్‌‌లోని రాంచీలో పర్యటించ.. ప్రసిద్ధ చిన్నమస్త స్వామి ఆలయాన్ని సందర్శించారు. రాంచీలోని యాగోధ ఆశ్రమంలో గంటసేపు ధ్యానం చేశారు. అనంతరం రాజ్ భవన్‌లో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. అయితే సూపర్ స్టార్ యోగి కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రజినీకి వ్యతిరేకంగా ఆ విషయాన్ని నెగిటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇక తమిళనాడులో చాలా మంది బీజేపీకి వ్యతిరేకం అని తెలిసిందే. దీంతో రజినీ కాళ్ళ మీద పడడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Exit mobile version