Pawan Kalyan OG : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవలే వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో పలు ఇండస్ట్రి లకు సంబంధించిన నటీనటులు నటిస్తున్నారు. రోహిత్ శెట్టి, అనుపమ్ ఖేర్, ప్రకాష్ రాజ్, టబు, ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో రాబోతున్న చిత్రంపై అప్డేట్ వచ్చేసింది.
పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన #OG టీమ్ (Pawan Kalyan OG)..
పవన్ అన్నీ ప్రాజెక్టుల్లో కన్నా ఈ సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. అయితే సుజీత్ ఇప్పుడు లోకేషన్ల వేటలో చాలా బిజీగా ఉన్నారని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. సుజీత్ తో పాటు డీవోపీ రవి కే చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ తో కలిసి లోకేషన్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఫొటోలను బట్టి సుజీత్ ముంబై లోని పలు ఫేమస్ స్పాట్ లను షూటింగ్ కు ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, చారిత్రక కట్టడమైన ఫ్లోరా ఫౌంటేన్ వంటి లోకేషన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో వచ్చిన పోస్టర్ కూడా భారీ హైప్ ను క్రియేట్ చేసింది.
Our director @sujeethsign, along with @dop007 and production designer #ASPrakash, are on a location scout for #OG! 🔥❤️ pic.twitter.com/l2ZbfJ0rjb
— DVV Entertainment (@DVVMovies) March 26, 2023
ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ తమన్ కొట్టేసిన విషయం తెలిసిందే. తమన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాల్లో తమన్ కొట్టిన బీజీఎంకి పవన్ ఫాన్స్ ఫిదా అయ్యారు. దీంతో తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అదరగొట్టాలి అని.. హ్యాట్రిక్ సూపర్ హిట్ ఆల్బమ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.