Site icon Prime9

Sudigali Sudheer: జబర్ధస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ

sudigali sudheer re entry to jabardasth

sudigali sudheer re entry to jabardasth

Sudigali Sudheer: బుల్లితెర నటుడు, కమెడియన్, యాంకర్, మెజీషియన్ అయిన సుడిగాలి సుధీర్‏కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్టీటాలెంటెడ్ గా ఉన్న సుధీర్ తన నటనతో టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో అందరికీ తెలిసిన విషయమే. తనదైన మాట, ఆట, పాట, నటనతో అలరించే సుధీర్ కు అమ్మాయిల ఫాలోయింగ్ కాస్తంత ఎక్కువనే చెప్పాలి. జబర్దస్త్ వేదికపై కమెడియన్‏గా అలరించే సుధీర్‏ కొద్ది నెలలుగా ఈటీవీలో మరియు జబర్ధస్త్ లో  కనిపించకుండా స్టార్ మా మరియు జీ ఇలా ఇతర టీవీ ఛానల్స్ లో షోలు చేస్తూ ప్రజలను మెప్పిస్తున్నారు. ఇక బుల్లితెర నాట సుధీర్, రష్మి జోడీకి యూత్‏లో తెగ ఫాలోయింగ్ ఉందనుకోండి.

ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై మెరుస్తున్నాడు సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కమెడియన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాడు. ఇక ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. జబర్దస్త్ షోకు సుధీర్ కావడంతో అతని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈషోకు సుధీర్ దూరంకావడంతో అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. సుధీర్ తిరిగి జబర్దస్త్ షోకు వస్తే బాగుంటుందని అతని ఫ్యాన్స్ అనేకసార్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధీర్ తాను జబర్దస్త్ షోలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటని యాంకర్ సుధీర్ ను అడుగగా జబర్దస్త్ షో అన్నాడు. మరి ఎందుకు వదిలేశారు అని మళ్లీ అడిగారు సదరు యాంకర్. దానికి సుధీర్ జబర్దస్త్ షోను నేను విడిచి పెట్టలేదు. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఒక 6 నెలలు బ్రేక్ తీసకున్నాను. అతి త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.  ఈ వార్తతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇదీ చదవండి: “మా అబ్బాయితో డేటింగ్ చేస్తున్నావా” అని అడిగిన అల్లు అరవింద్

Exit mobile version