Hyderabad Pubs: హైదరాబాద్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. పబ్ లు, ఫామ్ హౌజ్ లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఇందులో పట్టుబడ్డవారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పబ్ లు, ఫామ్‌హౌజ్‌లపై ఆకస్మిక దాడులు! (Hyderabad Pubs)
నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా మద్యం సరఫరా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఇందులో పట్టుబడ్డవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి.. మద్యం సరఫరా చేస్తున్నారనే సమాచారంతో.. ఈ దాడులు నిర్వహించారు. నగర నడిబొడ్డున ఉన్న పబ్‌లతో పాటు.. శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌజ్‌ల్లో సోదాలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మదాపూర్‌లోని హాట్ కప్, బర్డ్ బాక్స్ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా.. మైనర్లకు మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్డ్ బాక్స్ పబ్‌కు లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. ఈ రెండు పబ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు.
అనుమతి లేని వాటిపై కఠిన చర్యలు..
నగరంలో చాలా పబ్ లకు అనుమతి లేదని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మైనర్లకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు వీరి దృష్టికి వచ్చింది. అనుమతి లేకుండా ఫామ్‌హౌజ్‌లోకి మద్యం తీసుకెళ్లినందుకు పలు కేసులు నమోదు చేశారు. మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ముషీరుద్దీన్, ఎటెర్నిటీ ఫామ్‌హౌజ్ నిర్వాహకులపై వివిధ సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. ఈ మూడు ఫామ్‌హౌజ్‌లకు సంబంధించి.. మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పబ్, ఫామ్‌హౌజ్‌ల నిర్వాహకులు తగిన నిబంధనలు పాటించాలని కోరారు.
ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫామ్‌హౌజ్‌లు, పబ్‌లపైనా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్, మొయినాబాద్, మేడ్చల్ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 32 పబ్‌లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో ఎక్కువగా నిబంధనలకు విరుద్ధంగా జూదం, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో 22 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.