Afghanistan: ఆఫ్ఘాన్‌లో ఆకలి కేకలు.. అన్నం బదులుగా నిద్రమాత్రలు

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ ను స్వాధీన పరుచుకున్న నాటి నుంచి అక్కడ తాలిబన్ల ప్రభుత్వం నడుస్తోంది. కాగా అఫ్ఘాన్ లో నానాటికి పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

Afghanistan: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ ను స్వాధీన పరుచుకున్న నాటి నుంచి అక్కడ తాలిబన్ల ప్రభుత్వం నడుస్తోంది. కాగా అఫ్ఘాన్ లో నానాటికి పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. చేసేందుకు పనిలేక, వేరే దేశాలకు వలస వెళ్లలేక పశ్చిమ అఫ్ఘాన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ఆహారం ఇవ్వలేని చాలా కుటుంబాలు వారికి నిద్రమాత్రలు ఇచ్చి నిద్రపుచ్చుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు అయితే తమ ఆడపిల్లల్ని మరియు కిడ్నీలను అమ్ముకుంటున్నారు. ఒక్కపూట భోజనం కూడా చేయలేని అధ్వాన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏ ఒక్క విదేశీ సాయం కూడా అందడం లేదు ప్రజలు వాపోతున్నారు.

ఏఎఫ్‌పీ నివేదిక ప్రకారం, ఆకలి నుంచి కుటుంబసభ్యులను బయటపడేసేందుకు తల్లిదండ్రులు వారి కుమార్తెలను రూ.2-2.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. తన ఐదేండ్ల కూతురిని రూ.90 వేలకు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని స్థానికుడు నిజాముద్దీన్ తెలిపాడు. చాలా ప్రాంతాల్లో కిడ్నీలు అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారని హెరాత్‌ క్యాంపులో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఆహారం అందజేస్తున్న అబ్దుల్‌ రహీం అక్బర్‌ విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ పరిస్థితి ఎంత మాత్రమూ ప్రభుత్వ సమస్య కాదని తాలిబాన్‌ ప్రతినిధి ఒకరు స్పష్టం చేయడం వారి ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ వ్యతిరేకంగా చైనా ప్రజల ఆందోళన