SBI Jobs: ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మరో మూడు రోజులే గడువు ఉండటంతో.. అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచిస్తోంది. అర్హులైన అభ్యర్ధులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
మరో మూడు రోజులే.. (SBI Jobs)
ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మరో మూడు రోజులే గడువు ఉండటంతో.. అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచిస్తోంది.
అర్హులైన అభ్యర్ధులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
బ్యాంకు శాఖల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలను రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎస్‌బీఐ ఏప్రిల్ 29నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జూన్ లో జరిగే అవకాశం ఉంది.
పరీక్ష తేదీని నిర్ణయించిన పది రోజుల ముందు నుంచి.. కాల్ లెటర్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
బీటెక్/ఎంటెక్ అర్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 182.. ఒప్పంద ప్రాతిపదికన 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యాంశాలివే..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కచ్చితంగా.. బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
లేదా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ లేదా ఎంటెక్/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ) అయినా పూర్తి చేసి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు పోస్టుల ఖాళీలను బట్టి నవీ ముంబయి, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికయ్యే అభ్యర్థులు మూడేళ్ల పాటు విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆయా పోస్టుల్లో నియమితులయ్యే ఉద్యోగులకు ఇచ్చే వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.