CM Jagan: ప్రజలు ఎన్నుకొన్న నేతలు, వారికే చుక్కలు చూపిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, అనేక సమయాల్లో ఇలాంటి ఘటనలు పదే పదే చోటుచేసుకొంటున్నా, అధికారంలో ఉన్నవారికి ఇవన్నీ కనపడడం లేదు. తాజాగా దేవీ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని ఇంద్రకీలాధ్రిని దర్శించుకొన్న సీఎం జగన్ పర్యటనలో మరోమారు అలాంటి ఘటనే చోటుచేసుకొనింది. భగవంతుడిని మొక్కాల్సిన చేతులు, ఏకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ గాల్లోకి చూపుతూ భక్తులు అసహనం వ్యక్తం చేసారు.
కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాధ్రికి విచ్చేసారు. ఆయన వచ్చి వెళ్లేంతవరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. క్యూలైన్లలో పెద్దలు, చిన్నారులు, మహిళలు అవస్ధలు పడ్డారు. ఒక దశలో దుర్గగుడి అధికారుల తీరుపై భక్తుల అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
సీఎం జగన్ ఇటీవల తిరుపతి పర్యటనలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకొనింది. గంగమ్మ ఆలయంలో ఆయన ఉన్న సమయం 20 నిమిషాలే. కానీ రాక సందర్భంగా ఉదయం నుండి రాత్రి వరకు ఆలయం వద్దకు భక్తులు రాకుండా పోలీసులు నిలిపివేశారు. దీంతో దూర ప్రాంతం నుండి వచ్చిన భక్తులు, సమీపంలోని వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సీఎం జగన్ ఏదేని పర్యటన నిమిత్తం ఓ ప్రాంతానికి వచ్చారంటే చాలు, ఇక అక్కడి ప్రజల బాధలు వర్ణణాతీతం. ఇంటి ముందు బ్యారికేడ్లు, రోడ్లు మూసివేయడాలు, ఇలా ఒకటేంటి, అన్నిటా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగడం పరిపాటిగా మారిపోయింది. ఇకనైనా ప్రజలు, భక్తులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని జగన్ పాలన చేయాలంటూ పదే పదే విజ్నప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:Digital India:గాంధీ జయంతిన ఖాదీ దుస్తులు కొనుగోలు