Site icon Prime9

Sithara Ghattamaneni : మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితారకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అలియా భట్..

sithara ghattamaneni post about alia bhatt goes viral

sithara ghattamaneni post about alia bhatt goes viral

Sithara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే.  చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సితార లేటెస్ట్ గా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ పోస్ట్ గమనిస్తే ఈ చిన్నారికి అలియా భట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను కొల్లగొట్టిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ మూవీ.  కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సీత పాత్రలో ఆమె అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా సినిమాలతో పాటే బిజినెస్‌ లోనూ దూసుకుపోతోన్న అలియా.. తన పిల్లల కోసం “కాన్షియస్ క్లాతింగ్” పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్టార్ కిడ్స్ కి గిఫ్ట్స్ పంపుతూ హీరోయిన్ అలియా భట్ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పుడు తాజాగా సితారకు కూడా దుస్తులు గిఫ్ట్ గా పంపింది అలియా. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సితార తెలియజేసింది. ‘మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బహుమతులు నాకు ఎంతగానో నచ్చాయి’ అని రాసుకొచ్చింది సితార. అలియా పంపిన దుస్తులు ధరించి ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక పోతే అలియా భట్ ED-A-MAMMA పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ నడుపుతున్నారు. కిడ్స్ వేర్ కి సంబంధించిన ఈ బ్రాండ్ ని అలియా తనదైన శైలిలో ప్రోమోట్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పిల్లలకు కూడా అలియా భట్ బట్టలు గిఫ్ట్ గా పంపారు. అలియా గత ఏడాది స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ అలియా బిజీగా గడుపుతుంది.

Exit mobile version