Site icon Prime9

Siddharth: ‘పుష్ప 2’పై హీరో సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌ – మండిపడుతున్న బన్నీ ఫ్యాన్స్‌

Siddharth about Pushpa 2 Patna Event

Siddharth about Pushpa 2 Patna Event

Siddharth Comments on Pushpa 2: హీరో సిద్ధార్థ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ వివాదస్ప వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా పుష్ప 2పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. సిద్ధార్థ్‌ నటించిన ‘మిస్‌ యూ’ డిసెంబర్‌ 31న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు ఓ తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్‌ సౌత్‌ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్‌ ఉందని చెప్పే క్రమంలో పుష్ప 2ని ఉదాహరణ చూపించాడు.

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్‌ ఈవెంట్‌కి సుమారు 3 లక్షలు మంది వచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. దీనికి సిద్ధార్థ్‌ స్పందిస్తూ.. అది అంత పెద్ద విషయం కాదంటూ ఊహించని కామెంట్స్‌ చేశాడు. మన దేశంలో జనాలు భారీ ఎత్తున గుమిగూడటం పెద్ద విషయం కాదు. మన రాష్ట్రంలో జేసీబీ తవ్వి ఆపేసిన స్థలాన్ని చూసేందుకు కూడా జనం ఎగబడతారు. కాబట్టి అల్లు అర్జున్‌ని చూసేందుకు బీహార్‌ ప్రజలు గుమిగూడటం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే వాళ్లు వస్తారు. ఇండియాలో జనాలు రావడం గొప్ప విషయమే అయితే అన్ని రాజకీయా పార్టీలు తప్పక గెలవాలి కదా. బిర్యానీ ప్యాకెట్స్‌, క్వార్టర్‌ బాటిల్స్‌ కోసమే వస్తారు. అలాగే పాట్నాలో పుష్ప 2 ఈవెంట్‌ అంతమంది రావడం అనేది ప్రమోషన్‌ స్ట్రాటజీ మాత్రమే” అని కామెంట్స్‌ చేశాడు.

ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో సిద్ధార్థ్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అతడిని ట్రోల్‌ చేస్తూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు సినిమా ఆఫర్లే లేని నువ్వు పుష్ప 2 గురించి మాట్లాడే అర్హతే లేదన్నాడు. అతడి మొత్తం కెరీర్‌ చూసిన అల్లు అర్జున్‌ ఇమేజ్‌కి కూడా సరిపోదు అంటూ సిద్ధార్థ్‌పై ఫైర్ అవుతున్నారు. సిద్ధార్థ్‌ అసూయతో ఇలాంటి కామెంట్స్ చేశాడంటున్నారు. సిద్ధార్థ్‌ వీధిలో ఐటెం డ్యాన్స్ చేసిన చూడటానికి బీహార్‌లోనే కాదు తమిళనాడులో కూడా ఎవరూ రారంటూ ట్రోల్‌ చేస్తున్నారు. తన సినిమా మిస్‌ యూ ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్‌ ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటూ అతడి మండిపడుతున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ బన్నీ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఓ ఇండస్ట్రీ వాడు అయ్యుండి ఓ స్టార్‌ని, సినిమాను ఇలా తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్‌ కాదంటూ సిద్ధార్థ్‌కి చివాట్లు పెడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar