Site icon Prime9

SI resignation letter on social media: సోషల్ మీడియాలో ఎస్ఐ రాజీనామ లేఖ

SI resignation letter on social media

SI resignation letter on social media

SI resignation letter on social media: సమాచారం మేరకు, నూజివీడు సర్కిల్ లో ముసునూరు సబ్ ఇన్స్పెక్టర్ గా లక్ష్మీ నారాయణ ఈ నెల 10న బాధ్యతలు తీసుకొన్నారు. అయితే గత ఓ కేసు విషయంలో విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీ నారాయణను సస్పెండ్ చేస్తూ డీజిపి ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కొవ్వూరు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలో అవినీతి ఆరోపణల నేపధ్యంలో లక్ష్మీ నారాయణను వీర్ లో ఉంచారు. తాజాగా ఎస్ఐగా భాద్యతలు చేపట్టిన తర్వాత సస్పెండ్ కావడంతో ఆయన మనోవేదనకు గురైనారు. 2009 బ్యాచ్ కు చెందిన నేను 12 ఏళ్లుగా పోలీస్ విధులు నిర్వహిస్తూ సస్పెండ్ కావడం మనో వేదనకు గురైన్నట్లు, రాజీనామాపై అసహనం వ్యక్తం చేయడంతో పోలీసు శాఖలో చర్చనీయంశంగా మారింది. ఎస్సై లక్ష్మీ నారాయణ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్ష్య కావడం పట్ల దారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

రాజకీయ వాతావరణంలో సాగే పోలీసుల విధులు పట్ల నేటి పోలీసు అన్నలు గుర్తించకపోతే ప్రభుత్వం మారితే తమ పరిస్ధితులు ఎలా ఉంటాయోనని రాష్ట్రంలోని పలు పోలీసు అధికారులు చర్చించుకోవడం గమనార్హం.

Exit mobile version