Site icon Prime9

Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ అవుట్‌! – కారణమేంటంటే..

Shruti Haasan Exit From Adavi Sesh Movie

Shruti Haasan opts out of Two Telugu Projects: హీరోయిన్‌ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో భారీ విజయం అందుకున్న ఆమె ప్రభాస్‌ ‘సలార్‌’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ పాన్‌ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సలార్‌ 2లోనూ నటిస్తోంది.

మరోవైపు శృతిహాసన్ తెలుగులో పలు చిత్రాలకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. అందులో యంగ్‌ హీరో అడవి శేష్‌ డెకాయిట్‌: ఎ లవ్‌ స్టోరీ, చెన్నై స్టోరీలు ఉన్నాయి. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయ్యిండి చిన్న సినిమాలు నటించేందుకు ఒప్పుకోవడం అంతా షాక్‌ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల నుంచి ఆమె తప్పుకున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. కొన్ని విభేదాల కారణంగా శృతిహాసన్ ఈ రెండు ప్రాజెక్ట్స్‌ నుంచి తప్పుకుందని టాక్‌.

ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలే వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం శృతిహాసన్ సలార్‌ 2తో పాటు తమిళంలో పలు సినిమాలు చేస్తుందని, తెలుగులో ఆమె ఒప్పుకున్న డెకాయిన్‌, చెన్నై స్టోరీ చేయడం లేదని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు చెప్పినట్టు గుసగుస. అయితే డేట్స్‌ సర్దుబాటుతో పాటు ఆమె రెమ్యునరేషన్‌ వల్ల ఈ రెండు ప్రాజెక్ట్స్‌ నుంచి స్వయంగా తప్పుకుందని. కాగా గతేడాది డిసెంబర్‌లో అడివి శేష్, శృతి హాసన్‌ జంటగా డెకాయిట్‌ మూవీని ప్రకటించారు. ప్రకటనతోనే టీజర్‌ను కూడా విడుదల చేసింది టీం.

లేడీ ఒరియంటెడ్‌గా తెరకెక్కబోతోన్న చెన్నై స్టోరీలో మొదటి లీడ్‌ రోల్‌కి సమంతను అనుకున్నారు. అంతేకాదు దీనిపై ప్రకటన కూడా వచ్చింది. అనారోగ్యం వల్ల సామ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. దీంతో సమంత స్థానంలో శృతిహాసన్‌ తీసుకున్నారు. కొంతభాగంగా షూటింగ్‌ కూడా జరిగిందట. కానీ కొన్ని విభేదాల కారణంగా తాజాగా శృతిహాసన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ సలార్‌ 2తో పాటు తమిళంలో లోకేష్‌ కనగరాజ్‌-రజనీకాంత్‌ కాంబినేషన్‌లో రూపోందుతోన్న భారీ చిత్రం ‘కూలీ’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version