Site icon Prime9

Shrikant Tyagi Arrest: శ్రీకాంత్‌ త్యాగిని అరెస్ట్ చేసిన నోయిడా పోలీసులు

Noida: నోయిడా పోలీసులు శ్రీకాంత్‌ త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో త్యాగితో పాటు మరో ముగ్గురిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో తనకు తాను బీజేపీ కిసాన్‌ మోర్చా ఎగ్జిక్యూటివ్‌అని ప్రకటించుకున్నాడు త్యాగి. నిన్న నోయిడాలోని సెక్టార్‌ 93-బీలోని గ్రాండ్‌ ఒమాక్సీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని అధికారులు బుల్‌డోజర్‌తో కూల్చి వేశారు. అదే సొసైటీలో ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దాడి చేయడం తదితర అంశాలు సోషల్‌ మీడియాలో దుమారం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేయగా, త్యాగి పారిపోయాడు. కాగా నిన్న పోలీసులు ఆయన ఇంటిని బుల్‌డోజర్‌ కూల్చి వేయడమే కాకుండా ఆయన భార్యను కూడా కస్టడీలోకి తీసుకుంది. ఆయన భార్యతో పాటు బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారించింది.

ఆదివారం సాయంత్రం త్యాగి మద్దతు దారులు గ్రాండ్‌ ఒమాక్స్‌ సొసైటీలో ప్రవేశించి మహిళ ఇంటి అడ్రస్‌ కోసం వాకబు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేసి బీభత్సం సృష్టించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇటీవలే త్యాగి సొసైటీలో కొన్ని మొక్కలు నాటడాన్ని ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు ప్రకారం మొక్కలు నాటవద్దని వారించినా, త్యాగి అవేమీ పట్టించుకోకుండా మహిళను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడి కూడా చేశారు. అప్పటి నుంచి త్యాగి పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి 25వేల రూపాయల పరిహారం కూడా పోలీసులు ప్రకటించారు

Exit mobile version