Site icon Prime9

Nayanthara: నయన్‌ డాక్యుమెంటరీపై ప్రముఖ రచయిత విమర్శలు – డబ్బు కోసం ఇలా చేయడం కరెక్ట్‌ కాదు..

Shobhaa De Slams Nayanthara Documentary: ఇప్పటికే లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార డాక్యుమెంటరీ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్’ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ వాడినందుకు ధనుష్‌ కాపీ రైట్‌ దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలని నోటీసులు కూడా పంపాడు. దీనిపై నయన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తాజాగా మద్రాస్‌ హైకోర్టు కేసు కూడా నమోదు చేశాడు. ఇప్పటికే వివాదంలో నిలిచని నయన్‌ డాక్యుమెంటరీపై ప్రముఖ రచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ డాక్యుమెంటరీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని విమర్శించారు. కాగా నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ నయన్‌ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె బర్త్‌డే సందర్బంగా నవంబర్‌ 18 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ప్రొమోలతో దీనిపై ఆసక్తిని పెంచారు. అవి చూసి నయనతార డాక్యుమెంటరీ చూసిన ప్రముఖ బాలీవుడ్‌ నవలా రచయిత్రి శోభా దే దీనిపై విమర్శలు గుప్పించారు.

ఇది చూసిన ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక అభిప్రాయం వ్యక్తం చేశారు.  “నయనతార డాక్యుమెంటరీ చూశాను. ప్రొమోలు చూసే వరకు నయనతార ఎవరనేది పూర్తిగా తెలియదు. అవి చూసి డాక్యుమెంటరీ చూడాలని అనుకున్న. ఎలాగో ధైర్యం చేసి 45 నిమిషాలు డాక్యుమెంటరీ చూశాను. నాకు ఎక్కడ కూడా ఇది ఉపయోగకరంగా అనిపించలేదు. ఇందులో స్పూర్తి పొందే అంశాలేవి కనిపించలేదు. ఇందులో ఎలాంటి సందేశం లేదు. తన వివాహమే ముఖ్య అంశంగా ఈ డాక్యుమెంటరీ తీసినట్టు అనిపించింది. డబ్బుల కోసం వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డాక్యుమెంటరీగా రూపొందించడం సరికాదు.

ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బులు కోసం ఇదే ఫాలో అవుతారేమో. అంతేతప్పా ఇందులో ఉపయోగరకరమైన అంశాలేవి నాకు కనిపించలేదు” అని ఆమె విమర్శించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమె రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్టు ఇస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు దీపికా పదుకొనె వంటి స్టార్స్‌ కూడా ఇలానే తమ వెడ్డింగ్ స్ట్రీమ్‌ చేశారు.. దాన్నేమంటారంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీనికి శోభా దే కూడా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన విమర్శకుల నోళ్లు మూయించారు.

Exit mobile version
Skip to toolbar