Telangana New Cs: రాష్ట్ర నూతన సీఎస్ గా ఎవరు నియమితులవుతారనే విషయానికి తెరపడింది. ప్రభుత్వ నూతన సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి అటవీశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా శాంతి కుమారికి కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.
అమెరికాలో చదువు
అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన శాంకి కుమారి.. ఎమ్మెస్సీలో మెరైన్ బయాలజీ పూర్తి చేశారు. ఐఏఎస్ గా 30ఏళ్లు పాటు సేవలందిస్తు శాంతి కుమారి.. వివిధ అత్యుతన్న విభాగాల్లో పని చేశారు.
సమ్మిళిత అభివృద్ధి, పేదరిక నిర్మూలన, స్కిల్ డెవలప్ మెంట్, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
ఇక ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో సైతం ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు.
ఎప్పటి వరకు ఉంటారు
సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్ రిలీవ్ కావాలంటూ కేంద్రం తెలిపింది.
దీంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యం అయింది. ముగ్గురి పేర్లను ఎంపిక చేసిన ప్రభుత్వం చివరికి శాంతికుమారి పేరును ఖరారు చేసింది. ఇక ఈ పదవిలో సీఎస్‌గా శాంతికుమారి 2025 వరకు కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండి…
సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..
ఈ ఏడాది హాట్ స్టార్ కి షాక్.. ఆ ఓటీటీలో ఐపీఎల్ స్ట్రీమింగ్.. ఎన్ని భాషల్లో అంటే?
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/