D Srinivas: సీనియర్‌ నేత డీ.శ్రీనివాస్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

D Srinivas: ధర్మపురి శ్రీనివాస్ కు తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం.. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పాలనలో అనేక పదవులను స్వీకరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రజల మన్ననలు పొందారు.

D Srinivas: పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన కుమారుడు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ ప్రకటనలో తెలిపాడు. తండ్రి అనారోగ్యం కారణంగా రెండు రోజులపాటు కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

 

పీసీసీ మాజీ చీఫ్ గా బాధ్యతలు.. (D Srinivas)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు.. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన కుమారుడు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ ప్రకటనలో తెలిపాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం మరింత విషమించడంతో.. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ధర్మపురి అర్వింద్ తన కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆస్పత్రికి వెళ్లారు. సోమవారం ఉదయం ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు..

ధర్మపురి శ్రీనివాస్ కు తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం.. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పాలనలో అనేక పదవులను స్వీకరించారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రజల మన్ననలు పొందారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్‌గా డి. శ్రీనివాస్ పార్టీ కోసం పనిచేసి.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్ధిగా డీఎస్ పేరు మారు మోగింది. కొన్ని కారణాల వల్ల.. వైఎస్ సీఎం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు.. కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్‌లో డీఎస్‌కు కేసీఆర్ పెద్దపీట వేశారు. రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ కు అవకాశం కల్పించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీఎస్ ను దూరం పెట్టింది. పార్టీలో కొనసాగుతున్నప్పటికి ఆయన దూరంగానే ఉన్నారు.