Site icon Prime9

Actor Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబుకి అస్వస్థత.. ఇప్పుడు ఎలా ఉందంటే?

senior actor sarath babu admitted in hospital due to ill ness

senior actor sarath babu admitted in hospital due to ill ness

Actor Sarath Babu : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని సమాచారం అందుతుంది. శరత్ బాబు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారాయన. దాదాపు 220 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు శరత్ బాబు. ఇప్పటికీ ఆయన అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించారు శరత్ బాబు.

విషయం ఎలా తెలిసిందంటే..

శరత్ బాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ఖాతాలో శరత్ బాబు గురించి ఓ పోస్ట్ చేసింది. తనకు ఇష్టమైన నటుల్లో శరత్ బాబు ఒకరని, అప్పట్లో ఆయన కలల అమ్మాయిల కలల రాకుమారుడు అని పేర్కొంది. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని స్వామి వారిని వేడుకుందాం శ్రీరామరక్ష అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆయన అభిమానులు శరత్ బాబుకు ఏమైంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలానే శరత్ బాబు నటి రమాప్రభను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. ప్రస్తుతం ఆయనకు వయసు రీత్యా ఇంటి వద్దే ఉంటున్నారు.  ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

(Actor Sarath Babu) సినీ రంగ ప్రవేశం.. 

శరత్ బాబు ఆంధ్రప్రదేశ్ ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్.  1973 లో విడుదల అయిన ‘రామరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. ఆయన నటనకు గానూ 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి ‘సీతాకోక చిలుక’ సినిమాకు అవార్డును అందుకున్నారు. తర్వాత ‘ఓ భార్య కథ’, ‘నీరాజనం’ సినిమాలకు గానూ పలు అవార్డులు అందుకున్నారు.

 

Exit mobile version