Site icon Prime9

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎప్పుడు వస్తున్నామో చెప్తున్నామంటున్న టీం – రేపే రిలీజ్ డేట్‌ ప్రకటన

Sankranthiki Vasthunnam Release Date Announcement: ‘విక్టరి’ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఎఫ్ 2,ఎఫ్‌ 3 వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలతో తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న హాట్రిక్‌ మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్‌, టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను తాజాగా మూవీ టీం క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెబుతాం అంటూ ఆసక్తికరంగా ట్వీట్‌ చేసింది.

కాగా ఈ సినిమా సెట్‌పైకి వచ్చినప్పటి నుంచి మూవీ టీం వైవిధ్యంగా మూవీని ప్రమోట్‌ చేస్తుంది. షూటింగ్‌ సెట్‌లోని క్లిప్స్‌ రిలీజ్‌ చేస్తూ మూవీ అప్‌డేట్‌పై క్యూరియాసిటి పెంచుతున్నారు. ఇక ఎక్కువ భాగంగా సౌత్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వెంకీ ఇందులో లుంగీతో షర్ట్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన లుక్‌ ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలతో వదిలిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో వెంకటేష్‌ లుంగీ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్‌గా కనిపించగా… ఓ వైపు చీరలో ఐశ్వర్య రాజేష్‌.. మరోవైపు మోడ్రన్‌ లుక్‌లో మీనాక్షి చౌదరి నిలుచుని కనిపించింది.

ఈ పోస్టర్‌ ఆద్యాంతం ఆసక్తిగా అనిపించింది. అయితే ఇప్పటికే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లోకి తీసుకువస్తున్నామని మూవీ టీం ప్రకటించింది. కానీ, రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ‘2025 సంక్రాంతికి వస్తున్నాం ఎప్పుడు వస్తున్నామో రేపు చెప్తున్నాం’ అంటూ అప్‌డేట్‌ ఇచ్చింది. రేపు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండనుంది. మరి సంక్రాంతి బరిలో గేమ్‌ ఛేంజర్‌ వంటి పాన్‌ ఇండియా మూవీ ఉండటంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. వీటికి రేపటి చెక్‌ పడనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు సమర్పణలో శిరిష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి బీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version