Site icon Prime9

Kollywood : జ్ఞానవేల్ రాజా, సూర్య, కార్తీలపై అమీర్ కేస్ ఫైల్ .. వైరల్ అవుతున్న సముద్రఖని ట్వీట్ ..

Samuthirakani Fires On Karthi for ameer

Samuthirakani Fires On Karthi for ameer

Kollywood : కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తుంది. ఇక ఈ వివాదం అంతా కార్తీ చుట్టూ నడుస్తుంది.ఎప్పుడో 16 ఏళ్ల క్రిందట రిలీజ్ అయిన సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది . ఈ వివాదం గురించి నటుడు, సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీర్ కి సపోర్ట్ గా నిలిచి.. కార్తీకు, నీకు లైఫ్ ఇచ్చింది అమీర్, అలాంటి వ్యక్తి పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని జ్ఞానవేల్ పై ఫైర్ అయ్యారు.ఇటీవల కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కార్తీ 25 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులందర్నీ అతిథులుగా ఆహ్వానించారు. కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్‌’కి దర్శకత్వం వహించిన అమీర్ తప్ప మిగతా దర్శకులంతా ఆ ఈవెంట్ హాజరయ్యారు. ఇక అతను ఎందుకు రాలేదని ఒక ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజాని ప్రశ్నించగా ఆయన వైరల్ కామెంట్స్ చేశారు.

పరుతివీరన్‌ సినిమా సమయంలో ఎక్కువ లెక్కలు చూపించి దర్శకుడు అమీర్ తమ నిర్మాణ సంస్థ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారని జ్ఞానవేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక దీని మీద దర్శకుడు అమీర్ రియాక్ట్ అవుతూ.. “పరుతివీరన్‌ సినిమాకి పావు వంతు మాత్రమే డబ్బులు ఇచ్చి జ్ఞానవేల్.. సినిమా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను నా స్నేహితులు దగ్గర డబ్బులు తీసుకోని సినిమా పూర్తి చేశాను. నటుడు మరియు దర్శకుడు శశికుమార్ కూడా ఈ సినిమా పూర్తి చేయడానికి డబ్బు సహాయం చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ నిర్మాణ వివాదం విషయంలో అమీర్ ఆల్రెడీ కోర్టులో జ్ఞానవేల్ రాజా, సూర్య, కార్తీలపై కేసు కూడా ఫైల్ చేశారు. జ్ఞానవేల్ రాజా చేసిన మాటల్లో ఎటువంటి నిజం లేదని దర్శకుడు అమీర్ తెలియజేశారు. ఇక ఈ విషయం పై సముద్రఖని స్పందిస్తూ జ్ఞానవేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు మాట్లాడుతుంది చాలా తప్పు బ్రో. ఆ సినిమా షూటింగ్ లో నేను ఆరు నెలలు ఉన్నాను. నాకు మీరు ఎప్పుడు కనిపించలేదు. మీరేమో ఇప్పుడు నేనే నిర్మాత నేనే నిర్మాత అని చెబుతున్నారు.నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్‌ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్‌ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ సినిమా పూర్తి చేయడం కోసం వారు ఎంతో మంది దగ్గర అప్పు చేశారు .వాటిని మీరు తప్పుగా చూపించడం కరెక్ట్ కాదు. మీకు, కార్తీకి లైఫ్ ఇచ్చింది అమీర్” అంటూ సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

 

 

Exit mobile version