Site icon Prime9

Sameer Wankhede: నవాబ్ మాలిక్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమీర్ వాంఖడే

Mumbai: జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నవాబ్ మాలిక్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ డైరక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖకు చెందిన ముంబై జిల్లా కుల ధృవీకరణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆయన ఈ చర్య తీసుకున్నారు.

గోరేగావ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి ( ఐపిసి ) సెక్షన్ 500, 501 మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏసీపీ గోరేగావ్‌ డివిజన్‌ ఈ కేసును విచారించనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న వివిధ మనీలాండరింగ్ కేసులకు సంబంధించి మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహాయకులతో ముడిపడి ఉన్న ఆస్తి ఒప్పందం పై 2022 ఫిబ్రవరి 23న మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది.

Exit mobile version
Skip to toolbar