Site icon Prime9

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ కి బర్త్ డే విషెస్ చెబుతున్న పలువురు ప్రముఖులు.. నువ్వే నా ఫేవరెట్ అంటున్న సామ్

samantha birthday wishes to hero vijay devarakonda

samantha birthday wishes to hero vijay devarakonda

Vijay Devarakonda :  టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అదే ఊపులో `నోటా`, `టాక్సీవాలా`, `డియర్‌ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `లైగర్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుస చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా గొప్ప హిట్ అవుతుందని భావించినప్పటికి ఇది డిజాస్టర్ గా నిలిచింది.

అయితే రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నేడు (మే 9) న తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి విషెస్‌ తెలుపుతున్నారు. ఈ మేరకు హీరోయిన్‌ సమంత కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్‌ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా సోమవారం సాయంత్రమే విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేస్తూ విషెస్‌ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషెస్‌ తెలియజేయడం విశేషం. ఈ సందర్భంగా..  నా మంచి స్నేహితుడు, నా ఫేవరేజ్‌ కోస్టార్‌ విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నీ సక్సెస్‌ కోసం నేను ప్రార్థిస్తున్నా, విషెస్‌ తెలియజేస్తున్న. ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నావు` అని పేర్కొంది సమంత. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టిం చక్కర్లు కొడుతూ రచ్చ చేస్తుంది.

విజయ్‌ దేవరకొండతో గతంలో `మహానటి`లో కలిసి నటించింది సమంత. అందులో సెకండ్‌ లేయర్‌లో వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ నడుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు `ఖుషి` చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్‌ కపుల్‌గా కనిపిస్తున్నారు. అలానే మరోవైపు విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు, విజయ్, పరశురామ్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాము ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. పరశురామ్ – విజయ్ కాంబినేషన్ మళ్ళీ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Exit mobile version