Site icon Prime9

Saindhav : వెంకీ సైంధవ్ మూవీ నుంచి “రాంగ్ యూసేజ్ ” సాంగ్ రిలీజ్..

saindhav first song details

saindhav first song details

Saindhav : టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్‌’ ఆయన 75వ చిత్రంగా చిత్రీకరించబడుతుంది . హిట్ సినిమా ఫేం శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్,ఇటీవల టీజర్ ని విడుదల చేశారు . ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. వెంకటేష్ ఈ మద్య కాలం లో అన్నీ కామిడీ ఎంటర్టైనర్ గానే ఆడియన్స్ ని అలరించారు. ఇలాంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అవుతుంది. దీంతో వెంకీ మామ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చుస్తునారు. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు.

‘రాంగ్ యూసేజ్’ అంటూ సాగే ఈ పాటకి సంతోష్ నారాయణ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నాకాష్ అజిజ్ పాటని పదారు. ఇక క్యాచీగా ఉన్న ఈ ట్యూన్ కి చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం అందంగా ఉండడమే కాకుండా యూత్ కి ఒక మంచి సలహా ఇచ్చేలా కూడా ఉంది. డబ్బుని, ఫోన్, మద్యాన్ని.. ఇలాంటి వాటిని తప్పు పద్ధతిలో ఉపయోగించకు అంటూ చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇక ఈ పాటకి శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేయగా వెంకీ మామ తన స్టైల్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్ర చేస్తున్నారు. తమిళ్ హీరో ఆర్య ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సంక్రాంతి కి వెంకీ మామ ఫ్యాన్స్ కి పండగ సిద్ధం .

Exit mobile version