Site icon Prime9

Road Accident In Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు మృతి!

Road Accident in ysr district potladurthi village leads to 4 death

Road Accident in ysr district potladurthi village leads to 4 death

Road Accident In Bapatla District : శివరాత్రి వేళ ఆ శివయ్యను పూజించుకొని.. తిరునాళ్ళను వీక్షించి తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని విధి కాటేసింది. అయిన వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారంతా కొద్ది గంటల్లోనే ఇంటికి చేరుకుంటాం అనుకునే లోపే వారి జీవిత ప్రయాణం అకాలంగా ముగిసింది. ఈ ఊహించని రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని దూరం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. జిల్లా పరిధిలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చినగంజాం నుంచి అద్దంకి వెళ్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు రోడ్డు అవతలికి పడిపోవడంతో ఎదురుగా వస్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండడం మరింత శోచనీయం.

మృతుల వివరాలు (Road Accident In Bapatla District)..

మృతులు అయేషా, గుర్రాల జయశ్రీ, గుర్రాల దివ్య, కొండమీది వీరబ్రహ్మచారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు అద్దంకి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుందర్ వలి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు గుర్తించారు. గుంటూరులో ఉంటున్న ఎస్ఐ సుందర్ వలీ కుటుంబ సభ్యులు చినగంజాంలో జరుగుతున్న శివరాత్రి తిరునాళ్ల మహోత్సవాలను చూసేందుకు వచ్చారు. చినగంజాంలో ఉత్సవాలు ముగించుకున్న అనంతరం వారు అర్ధరాత్రి కారులో అద్దంకిలో ఉంటున్న ఎస్ఐ సుందర్ వలి నివాసానికి బయల్దేరారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి గుంటూరుకు వెళ్దామనుకున్నారు. ఈ క్రమంలో అద్దంకికి వస్తున్న క్రమంలో మార్గం మధ్యలో ఈ ఘటన జరిగి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

ఎస్ ఐ సుందర్ వలీ భార్య, కూతురుతో పాటు గుంటూరులో నివాసముంటున్న ఆయన భార్య కుటుంబ సభ్యులు, నివాసానికి ఇరుగు పొరుగున ఉన్న ఇద్దరు మహిళలు, డ్రైవర్ కలిపి మొత్తం ఐదుగురు ఈ ఘటనలో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారి మృతదేహాలను చూసి ఎస్సై విలపించడాన్ని చూసి సహచర పోలీసులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషాద ఘటనతో వారి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version