Rj Balaji Open Up on Why He Step Out From Nayanthara Movie: లాక్‌డౌన్‌లో నయనతార నటించని ‘ముక్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు నటుడు ఆర్జే బలాజీ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఇది ఆయనకు ఫస్ట్ మూవీ. తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ‘ముక్తి అమ్మన్’కు కొనసాగింపు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ నయన్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే డైరెక్టర్ మాత్రం ఆర్జే బలాజీ కాదు. ముక్తి అమ్మన్ 2పై ఎప్పుడో ప్రకటించిన డైరెక్టర్ మాత్రం లేట్ ఫిక్స్ చేశారు.
ఫైనల్‌గా సి సుందర్‌ను ఈ సినిమా డైరెక్టర్ ఫిక్స్ చేశారు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. దాంతో ఆర్జే బలాజీకి, నయనతార మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకు సీక్వెల్ నుంచి ఆయనను తప్పించారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా ఆర్జే బలాజీ స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. నయనతార ఐడియాకు తాను సెట్ అవ్వనని, అందుకే సీక్వెల్ నుంచి తప్పుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “ముక్తి అమ్మన్ కథ నేనే రాశాను. నయనతారను లీడ్ రోల్‌గా పెట్టి సినిమాను తెరకెక్కించాను. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి విజయం సాధించింది. ముందు నుంచి ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచన లేదు. ఇది నయనతారది. ఆమె దగ్గర ఓ ఐడియా ఉంది. అది నాకు ఆసక్తిగా అనిపించలేదు. దానికి నేను సెట్ కాను అనిపించింది. ఈ క్రమంలో ఆమె సుందర్. సితో వర్క్ చేస్తున్నారు. నిజానికి నాకు సీక్వెల్‌పై పెద్దగా ఆసక్తి కూడా లేదు. అంతేకాని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. క్రియేటివ్ విషయంలో డిఫరెన్సస్ వచ్చాయంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. సుందర్. సి గారే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అలాంటి ఆయన నా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అందుకు నాకు ఆనందంగా ఉంది. ఏం జరిగిన నా మంచకే అనుకుంటున్నా. ప్రస్తుతం నేను హీరో సూర్య గారితో వర్క్ చేస్తున్నారు. సూర్య 45వ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నా” అని చెప్పుకొచ్చారు. కాగా కోలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో ఆయన కమెడియన్‌గా నటించి అలరించారు. మహేష్ బాబు స్పైడర్ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఇందులో ఆయన మహేష్ బాబు ఫ్రెండ్‌గా కనిపించారు. కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన సడెన్‌గా ‘ముక్తి అమ్మన్’తో మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత సత్యరాజ్‌తో ఓ సినిమా తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా హీరో సూర్యని డైరెక్ట్ చేయబోతున్నారు.