Site icon Prime9

India vs England 3rd ODI: ఇంగ్లాండ్‌పై మూడో వన్డే గెలిచిన భారత్.. వన్డేలో తొలి సెంచరీ చేసిన రిషబ్ పంత్

Manchester: భారత జట్టు మరోసారి సత్తాచాటింది. ఇంగ్లాండ్ సొంతగడ్డ పై రోహిత్ సేన ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2-1 తేడాతో రోహిత్‌ సేన సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 42.1 ఓవర్లలో ఛేదించింది. రిషభ్‌ పంత్‌ 113 బంతుల్లో 125 పరుగులు చేయగా, హార్దిక్‌ పాండ్య 55 బంతుల్లో 71 రన్స్ చేసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. పంత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

Exit mobile version