Site icon Prime9

Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫాం హౌజ్‌లో రేవ్‌ పార్టీ – 35 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police Raids at KTR Relative Farm House: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించడంతో పోలీసులు దాడులు చేశారు. మోకిలా పోలీసుల స్టేషన్‌ పరిధిలోని జన్వాడ రిజర్వ్‌ కాలనీలో ఉన్న కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌజ్‌లో శనివారం రాత్రి రేవ్‌ పార్టీ నిర్వహించారు. ఫాం హౌజ్‌లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్థానికుల సమాచారం మేరకు సైబరాబాద్‌ ఎస్‌వోటీ, ఎక్సైజ్‌ పోలీసులు అర్థరాత్రి ఫాం హౌజ్‌లో తనిఖీలు చేపట్టారు.

ఈ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొనగా వారిలో 21 పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగింఇచనట్టు తేలడంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారందరి బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలకు పంపించారు. అందులో మద్దూరి విజయ్‌ అనే వ్యక్తి కోకైన్ తీసుకున్నట్టు పరీక్షలో తేలింది. దీంతో పోలీసులు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది ఫాంలో హౌజ్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించడంతో ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అంతేకాదు రాజ్‌ పాకల ఈ పార్టీ కోసం ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు కేటీఆర్‌ బావమరిదిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈ దాడులో పోలీసులు డ్రగ్స్‌తో పాటు అనుమతి లేని 10 ఫారిన్‌ లిక్కర్‌ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version