Rashmika Seeks Apology: నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్షమాపణలు కోరింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మహేష్ బాబు సినిమా పేరు విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యి తప్పు పేరు చెప్పింది. తన పోరపాటును గుర్తించిన రష్మిక సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది. అయితే ఆమె చేసిన పోరపాటుకు మహేష్ బాబు ఫ్యాన్స్ రష్మికపై మండిపడుతున్నారు. ఆమె వీడియోని నెట్టింట వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ విజయ్ సాధించింది.
ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్ గురించి తెలిసిందే. నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఆమె పుష్ప 1తో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ఇక వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ అందుకుంటుంది. గతేడాది యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె ఈ ఏడాది పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో రష్మిక క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భామ ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింద. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
మీరు చూసి ఫస్ట్ మూవీ ఏంటి? హోస్ట్ ప్రశ్నించారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. విజయ్ దళపతి గిల్లి మూవీ అని సమాధానం ఇచ్చింది. ఇది తాను చూసిన ఫస్ట్ మూవీ అని, అందుకే విజయ్ దళపతి అంటే తనకు ఇష్టం. ఇందులో అప్పడి పోడే పోడే సాంగ్ అంటే చాలా ఇష్టం. ఈ పాటకు నేను ఎన్నిసార్లు డ్యాన్స్‌చేశానో నాకే తెలియదు. అయితే గిల్లి.. తెలుగు పోకిరి చిత్రానికి రిమేక్ నాకు ఈ మధ్య తెలిసిందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ రష్మిక తప్పులో కాలేసింది. గిల్లి.. పోకిరి రీమేక్ కాదు. మహేష్ బాబు ‘ఒక్కడు’ మూవీకి రీమేక్ ఇది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి క్షమాపణలు కోరుతూ తన పోరపాటును సరిదిద్దుకుంది.
#Ghilli is a remake of #Pokkiri enti raashu😂😂#RashmikaMandannapic.twitter.com/pAUKXaApGN
— Filmy Bowl (@FilmyBowl) December 20, 2024
ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. “అవును, నాకు తెలుసు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు అసలు విషయం అర్థమైంది. ఒక్కడు సినిమాను గిల్లిగా.. పోకిరిని పోకిరిగా రీమేక్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏస్తున్నారు. నన్ను క్షమించండి. ఏదైనా సరే ఆ చిత్రాలన్నీ కూడా నాకు ఇష్టమే. ఇట్స్ ఓకే” అంటూ తన తప్పుని ఒప్పేసుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మికపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఆమె కామెంట్స్‌పై ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశారు. చేసేవి తెలుగు సినిమాలు… కానీ పొగిడేది వేరే సినిమా హీరోలను. అసులు తనని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు తీసుకుంది. రీమేక్ అయిన సినిమాల పేర్లుతెలుసు కానీ, అసలు మూవీ పేరు తెలియదు. వెంటనే మహేష్ బాబు, పూరీ జగన్నాథ్‌లను రష్మిక క్షమాపణలు కోరాలి” అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రష్మిక కామెంట్స్‌పై సోషల్ మీడియా పెద్ద చర్చ, రచ్చ కొనసాగుతుంది. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.