Site icon Prime9

Rapido Driver: రాపిడో డ్రైవర్ వేధింపులు.. బైక్ మీద నుండి దూకేసిన యువతి

rapido driver

rapido driver

Rapido Driver: కర్ణాటక రాజధాని బెంగళూరులో కదులుతున్న బైక్ నుంచి ఓ యువతి దూకేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాపిడో డ్రైవర్.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో దూకేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసభ్య ప్రవర్తన..

కర్ణాటక రాజధాని బెంగళూరులో కదులుతున్న బైక్ నుంచి ఓ యువతి దూకేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాపిడో డ్రైవర్.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో దూకేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ప్రైవేట్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో ఇందిరానగర్ వెళ్లడానికి రాపిడో బుక్ చేసుకుంది. అయితే డ్రైవర్ యువతిని వేరే మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దాంతో పాటు.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో.. యువతి బైక్ పై నుంచి దూకేసింది. ఈ ఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. యువతికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యువతి సూచింన మార్గంలో కాకుండా ఇతర మార్గంలో వెళ్లి.. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్‌ను లాక్కుని వెకిలిచెష్టలకు పాల్పడ్డాడు. పైగా ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. బైక్ పై నుంచి దూకేసిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాపిడో బైకర్ ను అరెస్ట్ చేశారు.

Exit mobile version