Site icon Prime9

Ram Gopal Varma : ముద్దుగా బొద్దుగా రసగుల్లాలా ఉంటావు.. టీడీపీ నేత పట్టాభిరామ్ పై రామ గోపాల్ వర్మ సెటైర్లు

Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma : టీడీపీ నేత పట్టాభిరామ్‌ ముద్దుగా బొద్దుగా రసగుల్లాలా ఉంటాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. తాను రాజకీయ కుట్రల నేపథ్యంలో సినిమా తీయనున్నట్టుగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. దీనితో వర్మపై టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జీవీ.. గుమ్మడి దొంగ అంటే భూజాలు తడుముకుంటున్నట్టుగా.. సడన్‌గా బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీడీపీలో ఆడేంటో నాకు తెలియదు.. వాడి పేరు పట్టాభిరామ్ అనుకుంటా. ముద్దుగా, బొద్దుగా రసగుల్లాలా ఉంటాడు. ఒరేయ్ రసగుల్లా.. జగన్‌ను నేను ఎందుకు కలిశాననే తెలియకుండా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. తాను బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సినిమాలు తీస్తానని అనుకున్నప్పుడు.. హ్యాపీగా ఉండాలని గానీ, టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతున్నావని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రసగుల్లా అనేది కొంచెం మెత్తగా, జ్యూసీగా, తీయగా ఉంటదని.. అతడు చక్కెర, బెల్లంలో కూర్చొకుండా.. మిరపకాయలాగా ఫీలై ఏదో మాట్లాడితే చాలా చెండాలంగా ఉందని విమర్శించారు. అంత హైరానా పడితే షుగర్ ఎక్కువై, బీపీ వచ్చి చస్తావు.. కొంచెం చూసుకోవమ్మా రసగుల్లా అని సెటైర్లు వేశారు. రసగుల్ల ప్లేసులో రసగుల్లా ఉండాలని మిరపకాయలాగా యాక్ట్ చేయకూడదని అన్నారు. నీ మీద కోపం లేదు..జాలి కలుగుతుంది. నిన్ను చూస్తేనే బుగ్గ గిల్లాలని అనిపిస్తుంది. తెల్లగా, బొద్దుగా, ఎర్రగా ఎంతో ముద్దొస్తావ్. రసగుల్లా ఒకటే చెబుతున్నా.ఒక మనిషి పేరు గానీ, సబెక్జ్ ఏమిటనిగానీ చెప్పనప్పుడు.. నీకు నువ్వే ఊహించేసుకుని, నువ్వు భయపడిపోయి, నీ పార్టీవాళ్లను కూడా భయపెట్టేస్తున్నావు. నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు.

నాకు స్వీట్స్ అంటే ఇష్టమని నాకు నువ్వు నచ్చావు. రసగుల్లా తర్వాత నీలా బొద్దుగా, ముద్దుగా ఉన్న ఒక పదార్థాన్ని నేను చూడలేదు. అందుకే నా మాట విని.. ఇంకో రెండు రసగుల్లాలు ఎక్కువగా తిని ఇంట్లో కూర్చొ. ఇలా పేలతా ఉంటే.. బీపీ వచ్చి చస్తావు. మీ ఇంట్లో వాళ్లకు నీ అవసరం ఉండి ఉండొచ్చు.. అందుకే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవమ్మా అని వర్మ అన్నారు.

Exit mobile version