Site icon Prime9

Ram Charan – Upasana : మెగా ఫ్యామిలీ లోకి న్యూ ఎంట్రీ వచ్చేసిందోచ్.. అవధుల్లేని ఆనందంలో చరణ్, ఉపాసన

ram charan wife upasana gave birth to baby girl

ram charan wife upasana gave birth to baby girl

Ram Charan – Upasana : మెగా ఫ్యామిలీ లోకి అఫిషియల్ గా న్యూ ఎంట్రీ వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. మెగా ఫ్యాన్స్ అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని, ఆసుపత్రి బయట అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

కాగా డెలివరీ కోసం ఉపాసన నిన్నే హాస్పటల్ కు వచ్చారు. ఆమె తో పాటు తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ కూడా హాస్పటల్ కు వచ్చారు. గతేడాది డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఉపాసన గర్భం దాల్చిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెతోనే గడుపుతున్నారు. షూటింగ్స్ కు గ్యాప్ ఇస్తూ సతీమణితో ఆనందంగా గడుపుతూ వచ్చారు.

రామ్ చరణ్ – ఉపాసనలు 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డకోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఇన్నాళ్ళూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. బిడ్డ పుట్టిన తరువాత చరణ్ అండ్ ఉపాసన చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నట్లు ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి, సురేఖ సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఉపాసన చెప్పడం మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది.

Exit mobile version