Site icon Prime9

Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్.. ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో బుకింగ్స్

ram charan tej orage movie re release details

ram charan tej orage movie re release details

Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి ఈ సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి లాంగ్ రన్ లో కూడా పెద్దగా కలెక్షన్ లు లభించలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాగే ఇప్పటికి కూడా ఈ మూవీ కి ఈ మూవీ లోని పాటలకు ఎంతో మంది ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీని మార్చి 25 , 26 తేదీలలో 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ‘ఆరెంజ్’ సినిమాను రీరిలీజ్ చేసి, వచ్చిన నగదును జనసేనకు విరాళంగా ఇస్తామని నాగబాబు ప్రకటించారు. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమనులంతా ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే ఈ మూవీ నిర్మాత, చరణ్ బాబాయ్, మెగా బ్రదర్ నాగబాబు ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

 

(Ram Charan Tej) ఆరెంజ్ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి – నాగబాబు

ఈ మేరకు ఆ పోస్ట్ లో.. తెలుగు వారి ఖ్యాతి ప్రపంచ నలుదిశలా చాటి చెప్పి, ఆస్కార్ వరకు పయనించిన ఆర్ఆర్ఆర్ చిత్ర కథానాయకుడు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదనం సందర్భంగా మార్చి 25, 26న కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’ ను విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. మెగా అభిమానులు, జన సైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగమై, వినోదంతో పాటు జనసేనను బలపేతం చేసే ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడకపోయినా సాంగ్స్ మాత్రం యూత్ ను ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై ఈ మ్యూజికల్ హిట్ మూవీని చూసి ఎంజాయ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.

 

 

 

Exit mobile version