Site icon Prime9

Ram Charan Tej : డైరెక్టర్ బుచ్చిబాబుకి సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. #RC16 షూటింగ్ అప్పటి నుంచే?

ram charan surprise to director buchibabu for his birthday

ram charan surprise to director buchibabu for his birthday

Ram Charan Tej : ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం చరణ్ RC15 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన తర్వాత ఈ సినిమా మొదలు అవుతుందని సమాచారం.

నమ్మకాన్ని నిలబెడతాను (Ram Charan Tej) చరణ్ సార్- బుచ్చిబాబు

తాజాగా బుధవారం నాడు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో చరణ్ బుచ్చిబాబుకు బొకే ఇచ్చి మరీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే బుచ్చిబాబు ని తనతో పాటు తన పర్సనల్ ఫ్లైట్ లో వైజాగ్ వరకూ తీసుకెళ్లి స్పెషల్ పార్టీ ఇచ్చాడు చరణ్. ఈ ఫ్లైట్ లో వెళ్లిన ఫోటోలను బుచ్చిబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ పుట్టిన రోజుని నేను మర్చిపోలేను. ఈ పుట్టిన రోజుని చాలా మెమరబుల్ గా మార్చారు చరణ్ సార్. త్వరలోనే మనం సెట్స్ లో కలవడానికి ఎదురుచూస్తున్నాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటాను. థ్యాంక్యూ సార్ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో చరణ్ అభిమానులు బుచ్చిబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ చరణ్ కి మంచి హిట్ సినిమా ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఉప్పెన సినిమా విజయం తర్వాత బుచ్చిబాబు వరుస సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ స్టార్ హీరోల కోసం ట్రై చేస్తూ పలువురు హీరోలకు కథలు చెప్పాడు. బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చినా ఇటీవల రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా ఉండబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా కూడా హిట్ సాధించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు తాజాగా RC 15 మూవీ ఐదు ప్రధాన లొకేషన్స్ లో మాంటేజ్ సాంగ్ షూట్ జరుపుకుంది. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు లోని ల్యాండ్ మార్క్ లొకేషన్స్ లో ఆ మాంటేజ్ సాంగ్ షూట్ జరిగింది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రతీ లొకేషన్ నుంచీ లీక్స్ ఓ రేంజ్ లో వచ్చి పడ్డాయి. అంతేకాదు. ఈ పాట లిరిక్స్ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఈ సినిమా స్టోరీ మొత్తం ఈ లీకుల కారణంగానే జనానికి తెలిసి పోయిందని మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా తన సినిమా షూట్స్ నుంచి ఒక్క లీక్ కూడా అవ్వకుండా జాగ్రత్త వహించే శంకర్.. ఈ సినిమా విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version