Site icon Prime9

Ram Charan: RC16 కోసం రామ్‌ చరణ్‌ సరికొత్త మేకోవర్‌ – ఫోటో షేర్‌ చేసిన మేకర్స్‌

Ram Charan New Look

Ram Charan Makeover For RC16: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్ మోస్ట్‌ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ విడుదలకు రెడీ అయ్యింది. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 10 జవనరి 2025న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ టీం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్‌ ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్‌ చేశారు. ఇటీవల మైసూర్‌లో షూటింగ్‌ కూడా మొదలైంది.

స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్‌ మేకోవర్‌ అవుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ జిమ్‌ ట్రైయినర్‌ ఆధ్వర్యంలో చరణ్‌ కసరత్తులు చేసి బాడీ బిల్డ్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్ట్‌ కూడా షేర్‌ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా RC16 నుంచి మేకర్స్‌ సాలీడ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా కోసం చరణ్‌ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రముఖ హెయిర్‌ స్టైలిష్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ చరణ్‌ని సరికొత్త లుక్‌లోకి మెకోవర్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్‌ని ఫోటోని షేర్ చేసి మూవీపై హైప్ పెంచింది మూవీ టీం. చరణ్‌ లుక్‌ కోసం సెలూన్‌లో వర్క్ చేస్తున్న స్టిల్‌ని రిలీజ్‌ చేశారు.

ఇందులో చరణ్‌ చైర్‌లో కూర్చోని ఉండగా.. ఎదురుగా స్టైలిష్ట్ ఆలిమ్‌ హకీమ్‌ పక్కనే బుచ్చిబాబు నిలుచుని గమనిస్తూ కనిపించారు. “ఆలిమ్ హకీమ్‌ ఆధ్వర్యంలో రామ్‌ చరణ్‌ సాలీడ్‌ లుక్‌లోకి మేకోవర్‌ వుతున్నారు. ఇది వరకు ఎన్నడు చూడని మాసీవ్‌ లుక్‌లో ఆయన కనిపించనున్నాడు” అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ మెగా ఫ్యాన్స్‌లో ఫుల్‌ బజ్ క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో చరణ్‌ ఎలాంటి లుక్‌లో కనిపించనున్నాడని అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రీలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమాలో చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతి బాబుతో తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో నవీన్‌ యర్నేనీ, రవిశంకర్‌లు RC16ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు సినీ సర్కిల్లో టాక్‌. ఇటీవల మైసూర్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Exit mobile version